తనను మరింతగా బాధపెట్టకండి…కోడెల
అసెంబ్లీ ఫర్నీచర్ కేసులో తన తప్పు లేదని కోడెల శివప్రసాద్ పునరుద్ఘాటించారు. ఆ విషయంలో తనను మరింతగా బాధించవద్దని ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో హైదరాబాద్ నుంచి ఫర్నీచర్ తీసుకువచ్చే క్రమంలో భద్రతా అధికారులు ఆ ఫర్నీచర్ ను తన క్యాంప్ కార్యాలయంలో పెట్టారన్నారు. తన పదవీ కాలం పూర్తయిన అనంతరం ఫర్నీచర్ ను తీసుకువెళ్లాల్సిందిగా లేఖ రాశాననీ, దానికి స్పందన లేకపోవడంతో స్పీకర్ కు కూడా లేఖ రాశాననీ కోడెల పేర్కొన్నారు. వాటిని పట్టించుకోకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 37 ఏళ్లుగా నిబద్ధతతో రాజకీయాలు చేసిన తనపై తప్పుడు ఆరోపణలు చేసి బాధపెట్టవద్దని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.













