ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం నేడు అట్టహాసంగా జరగనుంది. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య వివాహ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు లక్ష మంది భక్తులు హాజరవుతారన్న అంచనాతో కల్యాణ వేదికను నిర్మించారు. కల్యాణోత్సవానికి గవర్నరు నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు.
షరతులతో సీఎంకు అనుమతి :
కోదండరాముని కల్యాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించుకోకూడదని షరతు విధించింది.













