జూమ్ సమావేశంలో అనూహ్య సంఘటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ సమావేశంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నేతలు ఉన్నా ఫర్యాలేదని, వైసీపీ ప్రభుత్వం ఎలా ఏడ్చిందో వారికి తెలుస్తుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. విద్యార్థులను ఫెయిల్ చేయడం ప్రభుత్వ చేతగానితనమని, జూమ్‌లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టర్బ్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ సమావేశం నుంచి ఎమ్మెల్యే వంశీ తప్పుకున్నారు. కార్తిక్ కృష్ణ అనే విద్యార్థి పేరుతో కొడాలి నాని పాల్గొన్నారు. ప్రభుత్వ చేతగానితనాన్ని ఎండగడతానంటూ లోకేశ్ ఆ సమావేశాన్ని కొనసాగించారు.













