పకోడీ గాళ్లా..?
వైసీపీ దృష్టిలో సినిమా ఇండస్ట్రీ .. ఓ పిచ్చుకేనా? సినిమా హీరోలు పాటలు, ఫైట్లకే పరిమితం కావాలా? రాష్ట్ట్రానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడకూడదా…? తమకు సలహాలిచ్చే స్థాయి టాలీవుడ్ కు లేదని జగన్ అండ్ టీమ్ భావిస్తోందా? ఇటీవల మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కొడాలి నాని లాంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీపై చేస్తున్న విమర్శలు .. దీన్నే సూచిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొడాలి నాని అయితే ఓఅడుగు ముందుకేసి .. చిరంజీవిని ఉద్దేశించి పకోడిగాళ్లు తమపని తాము చూసుకోవాలన్నారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి తమకు ప్రచారం కావాలి..వాళ్లు తాము చెప్పినట్లు వినాలి.. లేదంటే పనికిమాలిన వాళ్లు, పకోడిగాళ్లు.. బ్రోతో మొదలైన పరిణామం.. ఇప్పుడు మరింత అథమస్థాయికి దిగజారింది. తమ్ముడు పవన్ కు మద్దతుగా పరోక్షంగా చిరంజీవి ఓ చిన్నప్రకటన చేసేసరికి వైసీపీ తట్టుకోలేకపోతోంది. వెంటనే తమ పార్టీలో ఉన్న సినీనటులను రంగంలోకి దించి విమర్శలు చేయిస్తోంది. మరి ఆ నేతలు.. పకోడిగాళ్లేనా ..? దీన్ని వారు గుర్తించాలని అంటున్నారు మెగా అబిమానులు. అయితే తమ్ముడికి కూడా చిరంజీవి చెప్పాలి కదా అని వైసీపీనేతలు ముక్తాయిస్తున్నారు.













