Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమం..? ముంబై తరలింపు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని AIG (ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆసుపత్రి నుంచి ముంబైలోని (Mumbai) ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు (Asian Heart Institute) ఆయన్ను తరలించినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యంపై అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
మార్చి 25 రాత్రి కొడాలి నానికి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరినప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యగా (gastric problem) భావించారు. అయితే ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయడంతో గుండె సంబంధిత సమస్యలు (Heart issues) ఉన్నట్టు గుర్తించారు. కొంతమంది అతనికి గుండెపోటు (heart attack) వచ్చినట్లు చెప్పారు కానీ.. ఆసుపత్రి వర్గాలు ఖండించాయి. అయితే ఆయన గుండెలో నాళాలు మూసుకుపోయినట్లు తెలిపాయి. ఐదు రోజులుగా అతను AIGలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారని సమాచారం అందుతోంది.
ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో ప్రసిద్ధి చెందింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, వైద్య బృందం అతన్ని అక్కడికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ప్రత్యేక విమానం ద్వారా అతన్ని ముంబైకి తరలించారని వార్తలు వస్తున్నాయి. కొడాలి నాని భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అతనితోపాటు ముంబై వెళ్లారు.
కొడాలి నాని వయస్సు 53 ఏళ్లు. గుడివాడ (gudivada) నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముపై (venigandla ramu) పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కోవిడ్ సోకడం, 2022లో కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స జరిగడం అతని ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. తాజా ఆరోగ్య సమస్య అతని అనుచరులను ఆందోళనకు గురిచేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అతని ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కొందరు టీడీపీ శ్రేణులు దీనిని రాజకీయంగా వాడుకుంటున్నారు. రెడ్ బుక్ పేరు గుర్తుకు రావడం వల్లే నానికి గుండెపోటు వచ్చిందని విమర్శిస్తున్నారు.













