Kishore: మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిశోర్‌కు ఎదురు దెబ్బ
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ (Macherla Municipal) చైర్మన్ కిశోర్ (Kishore)కు కూటమి ప్రభుత్వం నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కిశోర్‌ను చైర్మన్ (Chairman) పదవి నుంచి తొలగిస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ పదవి దుర్వినియోగం చేశారని, మున్సిపల్ చట్టం (Municipal law) సెక్షన్ 16(1) ఉల్లంఘించారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అనుమతిలేకుండా వరుసగా 15 సార్లు కౌన్సిల్ భేటీ (Council meeting)లకు కిశోర్ గైర్హాజరయ్యారు. దీంతో మున్సిపల్ చైర్మన్‌గా అతని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.













