ఈ నెల 24న టీడీపీలో చేరుతున్నా
ఈ నెల 24న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు మాజీ ఎంపీ కిశోర్ చంద్రదేవ్ ప్రకటంచారు. సీటు కోసమే అయితే 2014లోనే పార్టీ మారేవాడినని ఆయన అన్నారు. మరోసారి అశోక్‌గజపతిరాజుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని కిశోర్ చంద్రదేవ్ అన్నారు. విజయనగరంలో ఎంపీ అశోక్‌గజపతిరాజును కిశోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాంతకాలంగా కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ విధానాలను విభేదిస్తూ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసిన విషయం తెలిసిందే.













