టీడీపీలో చేరిన ముగ్గురు కీలక నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పలువురు నేతలు ఆయా పార్టీల గూటికి చేరుతున్నారు. తాజాగా ముగ్గురు కీలక నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్తో పాటు, మాజీ ఎమ్మెల్యే గోమాంగో, జయమణి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే విజయనగరం, విశాఖ జిల్లాలోని ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.













