Janasena: లోకేష్.. డిప్యూటి సీఎం: టీడీపీ, చంద్రబాబు.. మరో మెగా బ్రదర్: జనసేన
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమిలో నారా లోకేష్ (Nara Lokesh) ను డిప్యూటి సీఎం చేయాలంటూ టీడీపీ నేతల డిమాండ్ లు సెన్సేషనల్ అవుతున్నాయి. టీడీపీ నేతల మనసులో మాట బయటపెడుతూ హల్చల్ చేస్తున్నారు. కడప నుంచి రాజమండ్రి వరకు ఈ డిమాండ్ గట్టిగానే వినపడింది. లోకేష్ ప్రాధాన్యత ప్రభుత్వంలో తగ్గింది అనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ తరుణంలో జనసేన నేత కిరణ్ రాయల్ సెన్సేషనల్ కామెంట్ చేసారు. ఏకంగా చంద్రబాబును మెగా ఫ్యామిలీలో కలిపెసుకున్నారు.
తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ… మా దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు చంద్రబాబు(Chandrababu naidu)తో కలిపి నలుగురు అనుకుంటున్నామన్నారు. లోకేష్ ను డిప్యూటీ పదవీలో చూడాలని టిడిపి కేడర్ కోరుకోవడంలో తప్పు లేదన్నారు. మాకు పవన్ కల్యాణ్ ను సిఎం గా చూడాలని పదేళ్ళ గా ఎదురుచూస్తున్నామని పవన్ సిఎం చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయన్నారు. ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్ళారో అదే కోనగిస్తే మంచిదనన్నారు.
అనవసరంగా వైసిపి నేతలకు మాటలకు ఊపిరి పోయకండని కోరారు. వైసీపీ లో కొంతమంది జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారని వాళ్లకు అవకాశము ఇవ్వవద్దన్నారు. చిరంజీవితో కన్నా చంద్రబాబు తోనే ఎక్కువ జర్నీ చేస్తున్నామన్నారు. పేర్ని నాని, రోజా జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై రెండు రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయన్నారు. డ్రోన్ కెమెరా లపై 5 మంది అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ దేశానికి కావలసిన నాయకుడు.. అందుకే భద్రతా పెంచాలని కోరారు.













