ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే
ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే జరుగుతోందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఉండాలా? వద్దా? అని ఇన్ని రోజులు ఆలోచించానని అన్నారు. జాతీయ పార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించినట్లు తెలిపారు. నేను సీఎంగా ఉన్నప్పుడు రూ.7,400 కోట్లతో చిత్తూరు జిల్లాకు మంచినీటి పథకం ప్రణాళిక చేశాను. ఒక్క జిల్లా నీటి కోసమే అంత డబ్బు ఎలా ఖర్చు చేస్తారని ఆనాడు హరీశ్‌రావు నాతో గొడవపడ్డారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నేను ప్రారంభించిన మంచినీటి పథకాన్ని పక్కన పెట్టాయి. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇలా పనులు ఆపడం సరికాదు అని అన్నారు. ప్రాంతీయ పార్టీలు సొంత ఖజానా నింపుకుంటాయి తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవు అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.













