Singer Mangli: టీడీపీ మంత్రితో మంగ్లీ..! మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు..!!
సహజంగా అధికార పార్టీని ప్రతిపక్షంలోని నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఆ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికార పార్టీపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే కారాలు మిరియాలూ నూరుతున్నారు. టీడీపీ (TDP) వైఫల్యాలను తెలుగు తమ్ముళ్లే సోషల్ మీడియా ఏ(Social Media) వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. వైసీపీ (YCP) కంటే ఎక్కువగా చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వ తప్పటడుగులను ఎత్తి చూపిస్తున్నారు. తాజాగా టీడీపీ కేంద్ర మంత్రి కంజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu).. సింగర్ మంగ్లీతో (Singer Mangli) కలిసి దైవదర్శనం చేసుకోవడం, ఆమెకు ప్రయారిటీ ఇవ్వడం తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం నచ్చలేదు.
సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనదైన పాటలతో తెలుగు ప్రజలకు ఆమె సుపరిచితురాలు. ఆమె తాజాగా శ్రీకాకుళం (Srikakulam) జిల్లా అరసవిల్లిలోని (Arasavilli) శ్రీ సూర్యనారాయణ స్వామిని (Sri suryanarayana Swamy Temple) రథసప్తమి రోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబంతో కలిసి ఆవిడ గుడికి వెళ్లారు. ఆ తర్వాత కూడా మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన మంగ్లి.. అక్కడ రామ్మోహన్ నాయుడితో కలిసి వేదిక పంచుకున్నట్టు సమాచారం. ఈ రెండు చోట్లా మంగ్లికి రామ్మోహన్ నాయుడు ప్రయారిటీ ఇచ్చారు. దీన్ని తెలుగు తమ్ముళ్లు అస్సలు సహించలేకపోతున్నారు.
రామ్మోహన్ నాయుడితో మంగ్లి కలిసి వెళ్లి దర్శనం చేసుకుంటే సమస్య ఏంటనే సందేహం చాలా మందికి రావచ్చు. అయితే గతంలో మంగ్లి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. జగన్ (YS Jagan) పై ఆవిడ పాట బాగా పాపులర్ అయింది. అదే సమయంలో టీడీపీ కోసం పాట పాడాలని అడిగితే బాబు పేరెత్తేందుకు తనకు ఇష్టం లేదని తిరస్కరించిందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆమె జగన్ పార్టీ తరపున ప్రచారం (Mangli election Campaign) కూడా చేశారు. ఫ్యాన్ గిర్రున తిరిగితే చల్లగుంటుందని చెప్పుకొచ్చారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా (Advisor to SVBC) నియమించి నెలకు లక్ష రూపాయల చొప్పున జీతం కూడా చెల్లించారు. ఈ జీవోను చాలాకాలం పాటు రహస్యంగా ఉంచారు.
ఇలా జగన్ కోసం అహర్నిశలూ శ్రమించిన మంగ్లీకి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఇంత ప్రయారిటీ ఇవ్వడమేంటని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే నేతలు మాత్రం వైసీపీకి అనుకూలురుకు ప్రయారిటీ ఇస్తున్నారని భగ్గుమంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది. మొదటి నుంచి కూడా వైసీపీ వాళ్లే ఇప్పటికీ రాజ్యమేలుతున్నారనే ఆరోపణలను తెలుగు తమ్ముళ్లు చేస్తున్నారు. తాజాగా మంగ్లీ ఇష్యూ కూడా దానికి తోడైంది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ ఇలాంటి విషయాల్లో తప్పటడుగులు వేస్తూనే ఉంది. దీంతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది.













