వైసీపీకి షాక్.. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. ఆమె కుమారుడు విక్రాంత్‌కు టెక్కలి అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కృపారాణి పోటీ చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో కృపారాణి శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విషయం సాధించారు. తొలి అవకాశంలోనే కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు.













