22న మార్కెట్లోకి కియా
కియా సెల్టోస్ కార్లు ఈ నెల 22న మార్కెట్లోకి రానున్నాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ఎర్రమంచిలో ఏర్పాటైన కియా పరిశ్రమలో కార్ల ఉత్పత్తి ఊపందుకుంది. ఇప్పటికే కియా డెమో కార్లు పలు షోరూమ్‌లకు చేరాయి. ఈనెల 22న షోరూమ్‌ల ద్వారా వినియోగదారులకు అందించనున్నారు. దేశవ్యాప్తంగా 180 కియా కార్ల విక్రయశాలలు ఉండగా.. స్థానిక పరిశ్రమ నుంచి సెల్టోస్ కార్లను ట్రక్కుల్లో తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా 30,500 మంది వినియోగదారులు కియా కార్లను బుక్ చేసుకున్నారు. పరిశ్రమలో రోజుకు 285 కార్ల వరకు ఉత్పత్తి అవుతుంతగా.. వినియోగదారుల బుకింగ్ మేరకు మరింత పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.













