సీఎం వైఎస్ జగన్‌కు కియా ఆహ్వానం
అనంతపురం జిల్లా పెనుకొండ ప్లాంటులో ఈ నెల 8వ తేదీన జరగనున్న కియా కొత్త కారు సెల్తోస్ విడుదల కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. కంపెనీ ఎండీ కూక్ హ్యున్ షిమ్, ముఖ్య పరిపాలన అధికారి థామస్ కిమ్‌లు ముఖ్యమంత్రిని తన నివాసంలో కలిశారు. పెనుకొండలోని కియా ప్లాంటు ద్వారా ఏడాదికి 3 లక్షలు కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. భవిష్యత్తులో ఏడు లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.













