ఏపీ ప్రభుత్వ వల్లే అనుకున్నది సాధించాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లే తాము అనుకున్న ఉత్పత్తి సామర్ధ్యానికి మించి కార్లను తయారు చేసి, మార్కెటింగ్ చేయగలిగినట్లు కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో జిన్ పార్క్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున తమకు పూర్తి సహాయ సహకారాలు అందించడంపై సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై కియా ఇండియా టీంతో సీఎం జగన్ చర్చించారు. కియా ఇండియా నూనత ఎండీ, సీఈవోటే జిన్ పార్క్‌ని సన్మానించి, జ్ఞాపిక అందజేశారు.













