చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరం : నాని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత వల్లే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని, ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఒక రాజకీయ నేతపై 31 కేసులు లేవని, ప్రతిపక్ష నేత జగన్పై ఈ కేసులు ఉండడం రాష్ట్రానికి సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ఆయన కుటుంబం ఆరాచక శక్తులకు నెలవని విమర్శించారు. 25 మంది వైకాపా ఎంపీ అభ్యర్థుల్లో 12 మందిపై కేసులు ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబును గతంలో పదేళ్లు ప్రతిపక్ష హోదాకు పరిమితం చేయడం వల్లే రాష్ట్రం విడిపోయిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు.













