టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం
టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నాని చెప్పారని ప్రచారం జరుగుతోంది. తన కుమార్తె కూడా పోటీ చేయబోదని చంద్రబాబుతో నాని చెప్పారని తెలుస్తోంది. ఇప్పటికే తన కుమార్తె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని కేశినేని పేర్కొన్నారు. అయితే పార్టీలోనే కొనసాగుతానని చంద్రబాబుకు కేశినేని తెలిపారు. ఈసారే వేరే అభ్యర్థిని చూసుకోవాలని చంద్రబాబుకు ఆయన సూచించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చానని నాని తెలిపారు.
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వివాదం నేపథ్యంలో పరాజయం తర్వాత పార్టీ కార్యాక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారని తెలుస్తోంది. సొంత పార్టీ నేతలు విమర్శలు చేసినా హైకమాండ్ పట్టించుకోకపోవడంపై నాని అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు.













