సీఎం వైఎస్ జగన్ తో ఎంపీ కేశినేని నాని భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నాని ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. ఆయనతో పాటు విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత మంగళవారం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాని సీఎం జగన్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.













