మీకు చేత కాకపోతే చెప్పండి…నేను చేసి చూపిస్తా
విజయవాడలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ జాప్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,250 కోట్ల నిధులను విడుదల చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని మీరు ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక పెద్ద సమస్యలను ఎలా పరిష్కారిస్తారు జగన్ గారు? మీకు చేత కాకపోతే చెప్పండి.. నేను చేసి చూపిస్తా నని అన్నారు. మీరు మీరు నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహారం చూసుకోవచ్చు అని సెటైర్ వేశారు.













