కేంద్రం వెనక్కి తగ్గేవరకు పోరాటం ఆగదు…
ఉద్యమాలు చేసి విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకుంటామని ఆంధప్రదేశ్ బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదానికి బి.సి.సంక్షేమ సంఘం వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా పోరాటం చేస్తామన్నారు. కుల మతాలకతీతంగా విశాఖ ఉక్కును కాపాడేందుకు పోరాటం చేస్తున్న వారందరికీ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని అన్నారు. రి•ర్వేషన్ల పక్రియను కూడా మెల్లమెల్లగా ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రయివేటీకరణ చేస్తే ఇక మిగిలేది ఏముందన్నారు.
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్టీల్‌ప్లాంట్ విషయంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలమా లేదా అన్న విషయాన్ని సీఎం స్పష్టం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ పెబ్బలి రవికుమార్, శ్రీనివాసరావు, బి.సి.సంఘం నేతలు ఎం. వెంకటశ్వేరరావు, గొర్లె శ్రీనివాసనాయుడు, పాండవ ఈశ్వరరావు, సుబ్బారావు, సిహెచ్.వెంకటరావు, పొట్నూరు భాస్కరరావు, వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.













