Kavali Greeshma: ఎమ్మెల్సీగా కావలి గ్రీష్మ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన కావలి గ్రీష్మ (Kavali Greeshma) పదవీ ప్రమాణం చేశారు. వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు (Koyye Mosen Raju) తన కార్యాలయంలో ఆమెతో ఎమ్మెల్సీ(MLC) గా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రీష్మ తల్లి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి కావలి ప్రతిభాభారతి (Kavali Pratibha Bharati) , వారి కుటుంబ సభ్యులు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ (Suryadevara Prasannakumar) పాల్గొన్నారు.













