సీఎం చంద్రబాబును కలిసిన కాపు నేతలు
కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ కాపునాడు, కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాపులకు న్యాయం చేయలేదని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 5 శాతం రిజర్వేషన్ కల్పించి ఆదుకున్నారని ప్రశంసించారు. ఉండవల్లి ప్రజావేదికలో చంద్రబాబును కలిసిన వారిలో కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు, కాపు సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ డైరెక్టర్ కంటా రాయల్ మురళీ మోహన్, 13 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.













