కాపు రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
కాపులకు రెండు దశాబ్దాల్లో ఎవరూ చేయంది తాము చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. కాగా, విద్యా, ఉద్యోగ భర్తీలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు శనివారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాపు రిజర్వేషన్లను ఆమోదించాలని కేంద్రానికి తీర్మానం చేశారు. దీంతో మొత్తం రిజర్వేషన్లు 55శాతానికి చేరుకోనున్నాయి.













