రాజధాని నిర్మాణానికి పెన్షనర్ల విరాళం
అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం కప్పులబండ గ్రామ పెన్షనర్లు అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.1.16 లక్షల విరాళం చెక్కును సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి అందజేశారు. కప్పలబండ గ్రామ ఫెన్షనర్లు రాఘవయ్య నాయుడు (వికలాంగుడు) వెంకటేష్, నాగరాజు, మల్లికార్జున్, మరికొంత మంది పెన్షనర్లు ముఖ్యమంత్రిని కలిశారు. తమ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ముఖ్యమంత్రికి తెలిపారు. పెద్ద కొడుకుగా పేద కుటుంబాలను ఆదుకుంటున్నందుకు పెన్షనర్లు అందరూ మీకు రుణపడి ఉంటామన్నారు. మ్యుమంత్రిని మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని ఆశ్వీరించారు. రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చిన పెన్షనర్లను అభినందించిన ముఖ్యమంత్రి ఇదే స్ఫూర్తిని మరింతమంది కనపరచాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సృష్టం చేశారు.













