ఆయన ఆశయాలు సాధించడం కోసమే ఈ యాత్ర
బాపూజీ 150వ జయంతినీ పురస్కరించుకొని గాంధీ సంకల్ప యాత్ర చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈ యాత్రలో పాల్గొంటారన్నారు. బాపూజీ సిద్ధాంతాలు పాటించడం, ఆయన ఆశయాలు సాధించడం కోసమే ఈ యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును రేపు సందర్శిస్తామనీ, ప్రస్తుతం ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో పరిశీలిస్తామన్నారు. పోలవరం భవిష్యత్తు గురించి అధికారులతో చర్చిస్తామని తెలిపారు. ఈ నెల 13న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖమంత్రిని కలుస్తామని అన్నారు. పోలవరం కచ్చితంగా పూర్తిచేయాలనేదే తమ పార్టీ సంకల్పమని సృష్టం చేశారు.













