ఆరు నెలల తరువాతే స్పందిస్తాం : కన్నా
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆరు నెలల తర్వాత స్పందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని నమ్మి బీజేపీ వైపు టీడీపీ నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా వలస వస్తున్నారని అన్నారు. గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే పార్టీ తరపున స్పందిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వలనే గిరిజన విశ్వవిద్యాలయం ఆలస్యం అవుతోందన్నారు. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ అంతర్గత విభేదాలే ప్రస్తుత సంభోబానికి కారణమని బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హరిబాబు, మాజీ ఎం.ఎల్.ఎ విష్ణు కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.













