పోలీస్ వ్యవస్థ మొత్తం .. సీఎం అరాచకాలకే కాపలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మొత్తం ముఖ్యమంత్రి జగన్ అరాచకాలకు కాపలా కాస్తోందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ గుంటూరులో తలపెట్టిన శాంతి ర్యాలీకి వెళ్లకుండా పోలీసులు కన్నాను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్, పోలీసుల తీరుపై మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. పోలీసుల అండతో విపక్షాలను వేదిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో మహిళలు, చిన్న పిల్లలు అదృశ్యమవుతున్నా, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, ముఖ్యమంత్రి అరాచకాలకు అండగా నిలవడంతోనే సరిపోతోందని ఎద్దేవా చేశారు.













