చాక్లెట్ ఇచ్చి నక్లెస్ తీసుకున్నట్లు…కన్నా
చాక్లెట్ ఇచ్చి నక్లెస్ తీసుకున్నట్లు వైఎస్ జగన్ పాలన ఉందని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నవరత్నాలు అమలు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. 7వ సారి కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క దానిపై ధరలు పెంచారని మండిపడ్డారు. సీఎం జగన్ టీడీపీ కంటే ధరలు తగ్గించి చూపించాలన్నారు. కేంద్రం ప్రభుత్వం 130 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో 9తో సరిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.













