ఒక్క ఛాన్స్ అంటూ.. అన్ని రంగాలను నాశనం
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అన్ని రంగాలను నాశనం చేశారని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్కే పరిమితమవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలనా నడుస్తోందని విమర్శించారు. విద్యుత్, ఇసుక, ఆర్టీసీ, బస్సు చార్జీలు, నిత్యావసర ధరలు విచ్చలవిడిగా పెంచారన్నారు. గడిచిన మూడు సంవత్సరాలలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు. చెత్తపన్ను, ఆస్తి పన్ను నిత్యావసర ధరలు పెంపుకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది తప్ప మరొకటి లేదని తెలిపారు.













