ఆ వార్తల్లో నిజంలేదు : కన్నా
అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 22 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే, సంఖ్యా బలం దృష్ట్యా వైసీపీకి కేంద్రంలో కూడా సముచిత స్థానం దక్కే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి. వీటిపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సృష్టతనిచ్చారు. ఎన్డీయేలో వైసీపీ చేరుతోందని వార్తలో నిజం లేదని, అవన్నీ కల్పిత కథనాలే అని ఆయన తెలిపారు. ప్రజల పక్షాప బీజేపీ పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 9న మోదీ రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు.













