ఏపీ బీజేపీకి మరో భారీ షాక్!
బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆయన వైఎస్ఆర్ నేతలతో రహస్యంగా మంతనాలు చేసినట్లు సమాచారం. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి తనకు దక్కుదని నిర్ధారించుకున్న కన్నా లక్ష్మీనారాయణ అధిష్ఠానంపై అలక బూనినట్లు తెలుస్తోంది. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరులోని తన నివాసంలో అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని నేతలతో కూడా ఆయన సమావేశమైనట్లు సమాచారం. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేకపోవడం, అధ్యక్ష పదవి కూడా తనకు దక్కదని దాదాపు తెలియడంతో నిరాశకు గురైన కన్నా వైఎస్ఆర్లో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో కన్నా మంతనాలు జరుపుతున్నారని, త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.













