మీరు మరో స్టిక్కర్ సీఎం కావొద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ మీరు మరో స్టిక్కర్ సీఎం కావొద్దు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా ఒక్కో రైతుకు రూ.12,500లు ఇస్తామని ప్రకటించారు. కానీ దాంట్లో మోదీ ప్రభుత్వం రైతులకు రూ.6వేలు ఇస్తున్న సంగతి మరిచిపోవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకిచ్చే రూ.6 వేలు కలుపుకొని వైఎస్ఆర్ భరోసాగా పేర్కొనడం తప్పన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానిపై గతంలో చంద్రబాబులాగా స్టిక్కర్లు వేసుకోవడం సరికాదన్నారు. రైతు భరోసా పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.













