పవన్ ను మోసం చేస్తున్నారు, సోము వీర్రాజుపై కన్నా సంచలన కామెంట్స్…!
ఆంధ్రప్రదేశ్ బిజెపి లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అగ్ర నేతలుగా ఉన్న వారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అసహనంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కీలక ఆరోపణలు చేసారు. బిజేపి జిల్లా అధ్యక్షుల మార్పు ను తప్పుబట్టిన కన్నా… తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కోర్ కమిటి లో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారు అని అసంతృప్తి వ్యక్తం చేసారు. అధ్యక్షుల మార్పు నాతో చర్చించలేదన్నారు కన్నా.
ఇప్పుడు తొలగించిన వాళ్లంతా నేను నియమించిన వాళ్లే అని కోర్ కమిటి సమావేశం తప్ప పార్టీలో ఇతర ఏ సమాచారం మాకు తెలియడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నేను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పడు ఎంతో మందిని బిజేపి లో జాయిన్ చేశానని తెలిపారు. ఇప్పడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు. తన వియ్యంకుడు బిఆర్ఎస్ లో ఎందుకు చేరాడో సోము వీర్రాజు ను అడగాలన్న ఆయన ఎంపీ జీవీఎల్ ఆలోచన స్థానిక బిజేపి కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుందన్నారు.
అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవీఎల్ వైఖరి చూశామని జగన్ – కేసిఆర్ కుట్ర లో భాగంగానే బిఆర్ఎస్ లోకి ఏపి నేతలు చేరుతున్నారని మండిపడ్డారు. ఏపిలో పవన్, తెలంగాణలో బండి సంజాయ్ ను వీక్ చేసే కుట్ర జరుగుతుంది అన్నారు. జగన్, కేసిఆర్ లు కలసి ఈ కుట్ర చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసారు. ఒన్ షాట్ టూ బర్డ్స్ గా కాపు నేతలపై బిఆర్ఎస్ దృష్టి పెట్టిందని పవన్ కు మేమంతా అండగా ఉంటామని స్పష్టం చేసారు. కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసారు.













