కాణిపాకంలో బ్రహ్మూెత్సవాలు
చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి వార్షిక బ్రహ్మూెత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు సెప్టెంబరు 2 నుంచి 22 వరకు 21 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెనుమాక పూర్ణ చంద్రరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 2న వినాయకచవితి. 3న ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంసవాహనం. 4న నెమలి. 5న మూషిక. 6న ఉదయం చిన్నశేష, రాత్రి పెద్ద శేష వాహన సేవ. 7న వృషభ. 8న గ. 9న రథోత్సవం. 10న తిరుకల్యాణం, అశ్వవాహనం. 11న ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, ఏకాంత సేవలతో స్వామివారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలు ముగుస్తాయన్నారు. సెప్టెంబరు 12 నుంచి 22 వరకు 11 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.













