కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగురవేశారు. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి ఐఎస్‌వో 9001:2015 ధ్రువీకరణ పత్రాలను హైదరాబాద్‌కు చెందిన హెచ్‌్‌వైఎం ఇంటర్నేషనల్ సంస్థ ఎండీ శివయ్య, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో గురుప్రసాద్‌లకు అందజేశారు. ఆలయ పరిపాలనా విభాగం, ఆహార ప్రమాణాలకు సంబంధించి ఈ పత్రాలు అందజేశామని శివయ్య వెల్లడించారు.