సెప్టెంబరు 13 నుంచి కాకిపాకం బ్రహ్మూెత్సవాలు
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మూెత్సవాలు సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 3 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పూర్ణ చంద్రరావు తెలిపారు. సెప్టెంబరు 13న వినాయకచవితి. 14న ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంస వాహనం, 15న నెమలి, 16న మూషిక, 17న శేష, 18న వృషభ, 19న గజ, 20న రథోత్సవం. 21న తిరుకల్యాణం, అశ్వవాహనం, 22న ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, ఏకాంతసేవలతో స్వామివారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలు ముగుస్తాయన్నారు. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 3 వరకు 11 రోజులపాటు స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయని ఈవో వివరించారు. 23న అధికార నంది వాహనం, 24న రావణబ్రహ్మ, 25న యూళి, 26న సూర్యప్రభ, 27న చంద్రప్రభ, 28న విమానోత్సవం, 29న పుష్పపల్లకీ సేవ 30న కామధేను, అక్టోబరు 1న కల్పవృక్ష వాహనం, 2న పూలంగిసేవ, 3న తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.













