సీఎం రమేశ్ దీక్షకు కనిమోళి సంఘీభావం
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఏడో రోజు కొనసాగింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రజలు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. గడిచిన ఆరు రోజులుగా తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, నాయకులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చిన మద్దతు పలుకుతుండగా తమిళనాడులోని డీఎంకే ఈ దీక్షకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమోళి కడపకు వచ్చిన సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం తీరును ఎండగట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేస్తోందని ఆమె విమర్శించారు. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఆమెతో పాటు ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ, దేవినేని ఉమా మహేశ్వరరావు రమేశ్ దీక్షకు సంఘీభావం తెలిపారు.













