ఈ భేటీ రాష్ట్ర ప్రజల కోసమా? వ్యక్తిగతమా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల వరుస ఢిల్లీ పర్యటనల వెనుక ఉన్న రహస్యమేంటని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రుల వరస పర్యటనల అంతర్యమేంటి? ఈ భేటీ రాష్ట్ర ప్రజల కోసమా? వ్యక్తిగతమా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఎయిడెడ్ సంస్థల విలీనం నిర్ణయం విద్యావ్యవస్థకే ఎసరు పెట్టేలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. సమస్యలు పరిష్కరించలేక ఎదురు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి బుగ్గున అప్పుల కోసం ఢిల్లీలోనే తిష్ట వేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు. వారు పెయిడ్ ఆర్టిస్టులు అయితే కంగారెందుకు? రైతుల ఉద్యమ్యాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.













