కామినేని సంచలన ప్రకటన
పార్టీ మార్పుపై పలు ఊహాగానాలకు తెరదించుతూ 2019 లో నిర్వహించనున్న ఎన్నికలలో తాను పోటీ చేయనని ఎమ్మెల్యే కామినేని సంచలన ప్రకటన చేశారు. కైకలూరులో ఎమ్మెల్యే కామినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కామినేని రక్తదానం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019లో నిర్వహించనున్న ఎన్నికలలో తాను పోటీ చేయనని ప్రకటన చేశారు. కైకలూరు ప్రజలు తనను నమ్మి గెలిపించారని, అందుకే కైకలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించానని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలతో పని చేయాలని హితవు పలికారు. పదవులతో సంబంధం లేకుండా కొల్లేరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కొల్లేరు భూ పంపిణి చేసి ప్రజలకు న్యాయం చేశానని పేర్కొన్నారు.













