ప్రభుత్వం మారితేనే రాష్ట్రానికి భవిష్యత్తు
రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే సీఎంగా జగన్ దిగిపోవాలన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి సర్వనాశనం చేవారని మండిపడ్డారు. వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలో జీవించే హక్కును కోల్పోతామని అన్నారు. మంచి సిద్ధాంతాలతో పవన్ కల్యాణ్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన పోటీపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వం మారితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.













