చంద్రబాబు సీఎం అయితే.. ఏపీకి పునర్ వైభవం
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఏపీ అగ్రస్థానానికి వెళుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్ తెలిపారు. చంద్రబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సామాజిక సంస్కరణలు తీసుకువస్తే, చంద్రబాబు ఆర్థిక సంస్కరణలతో సమాజంలో సంపదను సృష్టించారని పేర్కొన్నారు. దేశవిదేశాలన్నీ తిరిగి పెట్టుబడులు భారీగా రాబట్టి అనేక పరిశ్రమలు నెలకొల్పారని, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. వందలాది కళాశాలలు స్థాపించి ఏపీని విద్య, ఉపాధి హబ్‌గా మార్చారని వివరించారు. గత అయిదేళ్ల జగన్ పాలనలో పరిశ్రమలు ఏపీ నుంచి తరలిపోయి, ఉపాధికోసం యువత వలస పోతున్నారని అన్నారు. చంద్రబాబు సీఎం అయితే ఏపీకి పునర్వైభవమన్నారు.












