టీడీపీకి మరో షాక్
తెలుగుదేశం పార్టీ తనను మోసం చేసిందని అరదుకే పార్టీని వీడి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వీరాశివారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తనను పూర్తిగా మోసం చేసిందని, దీంతో నియోజవకర్గ అభివృద్ది కాంక్షిస్తూ తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెరూసలెంకు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి కూడా తనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు.













