ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన భారం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసమర్ధత, అవినీతితో విద్యుత్ రంగం సర్వనాశనమైందని టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అవినీతి, దుబారా వల్లే విద్యుత్ కోతలని అన్నారు. చేతివాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయన్నారు. యూనిట్ రూ.20కి ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలులో మర్మమేంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు జగన్ ప్రభుత్వం రూ.12 వేల కోట్ల బకాయిలు పడిరదన్నారు. ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన భారం మోపారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చీ రాగానే ఒప్పందాలు రద్దుతో నేడు విద్యత్ కోతలు అన్నారు. రెండున్నరేళ్లలో వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం మోపారని పేర్కొన్నారు. ప్రజలు విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని సూచించడం సిగ్గుచేటన్నారు. ఉద్దరిస్తానని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సొంతం ఊడ్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













