అమరావతి రాజధానిగా గుర్తింపు టీడీపీతోనే
ముగ్గురు ఎంపీలున్న తెలుగుదేశం పార్టీ పోరాటంతోనే భారత చిత్రపటంలో అమరావతికి సర్వే ఆఫ్ ఇండియా స్థానం కల్పించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు తెలిపారు. 22 మంది ఎంపీలున్న వైకాపా మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపాలో ఇసుక మాఫియా తయారైందని వివరించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకాకుండా ఢిల్లీ వెళ్లి కేసులను రద్దు చేయించుకునే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారని తెలిపారు. దుబాయిలో సీఎం రమేష్‌కు చెందిన శుభకార్యానికి మాత్రమే టీడీపీ నేతలు వెళ్లారని, ఏ ఒక్కరూ పార్టీని వీడడం లేదని వివరించారు.













