టీడీపీలో చేరిన చలమలశెట్టి సునీల్
వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. గన్నవరం ఏబీ కన్వెన్షన్ సెంటర్లో సునీల్‌కు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. గత ఎన్నికల్లో చలమలశెట్టి సునీల్ వైసీపీ తరపున కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ కాకినాడ నుంచే పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. టికెట్ దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుత ఎంపీ తోట నరసింహం పోటీ చేయడం లేదని ప్రకటించడంతో సునీల్కే ఆ సీటు దక్కుతుందని భావిస్తున్నారు.













