సోమిరెడ్డి నీకు ఇదే లాస్ట్.. కాకాణి వ్యంగ్యాస్త్రాలు..
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎక్కడ చూసినా హడావిడి కనిపిస్తుంది. పార్టీలు అభ్యర్థుల జాబితాలు ప్రకటించడంతోపాటు ఎన్నికల ప్రణాళికలో బిజీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ తన మూడవ విడత జాబితాన్ని విడుదల చేసింది. ఇందులో సీనియర్ నేత ,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వినడానికి విడ్డూరంగా ఉన్న.. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డికి టికెట్ దక్కడంపై ఓ పక్క విమర్శిస్తూ మరో పక్క తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు కాకాణి. ఇప్పటికే నాలుగు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి రెండవ జాబితాలో కూడా టికెట్ రాకపోవడంతో.. ప్రచారాలు అప్పుడు ఎవరి గురించి మాట్లాడాలో అర్థం కాక టెన్షన్ పడ్డాను అని కాకాణి వ్యంగ్యాస్త్రాలు విసిరారు . అంతేకాదు సోమిరెడ్డికి మళ్ళీ ఛాన్స్ ఉంటుందో లేదో.. చివరి ఎన్నికలు అవుతాయి కాబట్టి ఓటు వేస్తే వేయండి.. అని ప్రచారం చేస్తాను అని ఎద్దేవా చేశారు. ఓటమి ఎదురొస్తున్నా అలుపెరగని యోధుడిలా ఇంకా పోరాడుతున్న సోమిరెడ్డి ఈసారి సర్వేపల్లి లో గెలుస్తాడేమో చూడాలి.













