ఒక సిద్ధాంతం కోసం 40 ఏళ్లుగా పోరాటం : చంద్రబాబు
ఒక సిద్ధాంతం కోసం 40 ఏళ్లుగా పోరాడుతున్న వ్యక్తి కైలాష్ సత్యార్థి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలులో బాలల భద్రతే భారత భద్రత పేరుతో నిర్వహిస్తున్న సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కైలాష్ సత్యార్థి వంటివారి అవసరం ఇంకా ఉందని అన్నారు. పిల్లల కోసం నిరంతరం పోరాడుతూ 144 దేశాలు తిరిగారని చెప్పారు. ప్రపంచాన్నే జయించే శక్తిని యువతకు ఉందని అన్నారు. ఈ రోజు మనం వేసే ప్రతిఒక్క అడుగు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచంలోనే పిల్లలు సంతోషంగా ఉండే ప్రదేశంగా ఆంధ్రాను తయారు చేస్తానన్నారు. భారతదేశంలో ఐదుగురికి నోబెల్ బహుమతి వచ్చిందని, అందులో కైలాష్ సత్యార్థి ఉండటం గర్వకారణమన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూళనకు అందరూ కృషిచేయాలని సూచించారు. బాలలను పనిలో పెట్టుకుంటే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. బాలలే దేశానికి అసలైన సంపదని అన్నారు. పిల్లలందరూ ఉండాల్సింది పనిలో కాదు, బడిలో ఉండాలని చెప్పకొచ్చొరు. చిన్నారుల మనోభావాలను గౌరవించాలన్నారు.













