ఈసారి తాను ఓడిపోవడం జరగదు… గెలుపు ఖాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రూ.60 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పార్టీ ఎవ్వరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడం అవసరమన్నారు. కేఏ పాల్ రావాలి.. పాల్తోనే పాలన మారాలి.. ఇదే మా నినాదం అని అన్నారు. డబ్బులు ఎలా తేవాలి, ఎలా ఖర్చు చేయాలో తెలుసునని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వంద వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. వైఎస్ జగన్కు హామీలు అమలు చేయాలని ఉన్నా డబ్బు లేదన్నారు. జగన్ను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరతానన్నారు. 2024 ఎన్నికల్లో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈసారి తాను ఓడిపోవడం జరగదని, గెలుపు ఖాయమని అన్నారు.













