అమెరికాలో ఉండి పిల్ ఎలా దాఖలు ?
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ శాంతి ప్రభోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కేఏ పాల్ తన పిటిషన్లో కోరారు. కేంద్ర గనులు, ఉక్కు హక్కు, కేంద్ర ఆర్థిక శాఖ, విశాఖ స్టీల్ ప్లాంట్, ఏపీ సీఎస్ లను తన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. దానిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం.. అమెరికాలో ఉండి పిల్ ఎలా దాఖలు చేశారని కేఏ పాల్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. జీపీఏ ద్వారా పిల్ దాఖలు చేశామని పాల్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. బీపీఏ ద్వారా ఎలా దాఖలు చేస్తారని కోర్టు మళ్లీ ప్రశ్నించింది. తదనంతరం వాదనలు కొనసాగగా, కేఏ పాల్ తరపు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. దాంతో కేఏ పాల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.













