విశాఖను వాషింగ్టన్ గా మార్చేస్తా.. కేఏ పాల్
విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరొక కొత్త స్టేట్మెంట్ విడుదల చేశారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన పాల్.. తాను ఎన్నికల్లో ఏడు ప్రధాన అంశాలతో వెల్లబోతున్నట్లు వెల్లడించారు. మంచి పాలన కావాలి అనుకునే వాళ్లంతా ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలి అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విశాఖను రాజధాని చేస్తానంటూ పాల్ హామీ ఇచ్చారు.. అంతేకాదు విశాఖను ఏకంగా వాషింగ్టన్ గా మార్చేస్తారట. తాను ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు రాష్ట్రంపై ఉన్న 13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. అంతేకాదు తాను ముఖ్యమంత్రి అవ్వడం చాలా మందికి ఇష్టం లేదని పాల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం విశాఖలో కాంట్రవర్సీకి కారణమైన స్టీల్ ప్లాంట్ సమస్యను కూడా సాల్వ్ చేస్తాను అని చెప్పిన పాల్ ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా రక్షిస్తానని హామి ఇచ్చారు.













